Latest Posts

బళ్లారిలో ఘనంగా Yes9 టీవీ కార్యాలయం ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ ప్రభాకర్ రెడ్డి

*బళ్లారిలో ఘనంగా (Yes9) టీవీ కార్యాలయం ప్రారంభం*

బళ్లారి, ఏప్రిల్ 17:
బళ్లారి జిల్లాలో (Yes9) టీవీ ఛానల్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. IJU జిల్లా అధ్యక్షుడు ఎర్రగుడి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల yes9 టీవీ ఎండీ,ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా రంగంలో నిబద్ధతతో సేవలు అందించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్నూలు జిల్లా ఆలూరు మండల APUWJ అధ్యక్షుడు బి. గోపాల్ నాయుడు, తాలూకా వైస్ ప్రెసిడెంట్ గుత్తి నాగరాజు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక అధికారిగల పత్రిక,రచయిత రవి, యువనాయక పత్రిక జిల్లా స్టాఫర్ సిద్దేశ్ స్వామి, సీనియర్ విలేకరి భీమా, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor