కర్నూలు జిల్లా..
ప్రభుత్వ బడిలో చేరండి -ప్రభుత్వ పతకాలు పొందండి.
ఆలూరు మండలం కురుకుంద గ్రామం లో ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ప్రవేశపెట్టిన బడి బాట కార్యక్రమం విద్యార్థులు తో కలిసి నిర్వహించడం జరిగింది. గ్రామం లో వీధి వీధి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడి లో చేర్పించాలని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలో చాలా మార్పులు తీసుకొచ్చారు. నిన్న వచ్చిన ఇంటర్ ఫలితాలు అందరిని ఆశ్చర్యం కలిగించాయి. ప్రవేటు కాలేజీ లకు ధీటుగా ప్రభుత్వం కాలేజీ లో చదివే విద్యార్థులకు 952/1000 రావడం జరిగింది.
ఒత్తిడి లేని నాణ్యమైన విద్యా
6నుండి 10తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం
పాఠశాల ప్రారంభం రోజునే తల్లికి వందనం డబ్బులు జమ
ఉచిత బట్టలు, బూట్లు, బెల్టు, బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, డిక్షణరీ ఇంకా మరెన్నో సౌకర్యాలు కలిగిన మన ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి.
కావునప్రవేట్ బడుల లక్షలు లక్షలు పోసి చవించడం మాని ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామం లో అందరికి చెపుతు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
