మహిళా మరియు బాల బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
మహిళలు వెలిగినప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారతకు మొదటి నుంచే తెలుగుదేశం మద్దతు పలుకుతోంది.
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న కలను నెరవేర్చుతున్న కేంద్ర ప్రభుత్వానికి, ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన
మహిళా మరియు బాల బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శ్రీనివాసులు, కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు, అనంతపురం జిల్లా శక్తి డిఎస్పి మహబూబ్ బాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, నేతృత్వంలోని ప్రభుత్వంలో బాలికలు, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవడంతో పాటు, నేరస్తులకు గట్టి హెచ్చరికలు అందుతాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు మరియు బాలికలు అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ముందుకు రావాలని, పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు.
అలాగే యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా మనం మనల్ని సిద్ధం చేసుకోవాలని, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు.
