అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
___________________________
జగన్ బ్రహ్మానందం మించిన కమెడియన్
జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందం మించిన కమెడియన్ గా మారారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జే. భరత్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకుడా వర్ధిల్లు నిండు నూరేళ్లు ప్రగతి పండుగ వేడుకల్లో రాయదుర్గం పట్టణంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హోమాలు, పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జే.భరత్ పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణంలోని జయంతి రుద్రయ్య శెట్టి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఆర్యవైశ్యులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో బ్యాడ్మిటన్ క్రీడా పోటీలను ప్రారంభించారు. రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద రూ. 59 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
జగన్ జగన్ హయామంలో అరాచక పాలన సాగిందని మండిపడ్డారు.అభివృద్ధి సంక్షేమంపై అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీ విమర్శించారు.
పార్లమెంటులో అమరావతి రాజధాని కి చట్టబద్ధత కల్పించడంలో మద్దతు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా మిగిలాడని ధ్వజమెత్తారు.
జగన్ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సిఐడి కేసులు నమోదు చేసి వేధించారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వోతో ముఖాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమన్నారు. రాయదుర్గంలో టెక్స్ టైల్స్ పార్క్ ఇండస్ట్రీ,టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
పది రోజుల చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించడంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు చరిత్ర సృష్టించారని కొనియాడారు.
బైట్స్.
1.టీ.జే. భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
