Latest Posts

ముదిగుబ్బలో సమ్మె బాటపట్టిన నీటి సరఫరా కార్మికులు: అధికారులకు సమ్మె నోటీసు అందజేత

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలానికి చెందిన సత్యసాయి నీటి సరఫరా విభాగం కార్మికులు గత ఐదు నెలలుగా తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25 నుంచి తాము నిర్వహించనున్న సమ్మె బాట కార్యక్రమంలో భాగంగా వారు సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సమ్మె నోటీసులను ముందస్తుగా పలువురు మండల అధికారులకు అందజేశారు, ఈ సందర్భంగా కార్మికులు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి తోపాటు ఎంపీడీవో శకుంతలకు, మండల సీఐ శివరాముడు లకు వేర్వేరుగా సమ్మె నోటీసులను అందజేశారు, ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నీటి సరఫరా కార్మికులు కూడా సమ్మెబాట పడితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపారు, కావున ప్రభుత్వం తక్షణమే సత్యసాయినీటి సరఫరా కార్మికుల తో పాటు Rws కార్మికులకు కూడా పెండింగ్ జీతాలు చెల్లించి వారు నిరవధిక దీక్ష చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు, మామూలుగా చాలా మండలాల్లో వేసవికాలంలో మాత్రమే నీటి సమస్య ఏర్పడుతుంటే ముదిగుబ్బ మండలం లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అలసత్వంతో ఏడాది పొడవునా తరచూ ఇక్కడ తాగునీటి సమస్య ఏర్పడుతూనే ఉందన్నారు, కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడమే గాక మోటార్లు కాలిపోయిన పైపులు పగిలిపోయిన సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో నిరంతరము ఇక్కడ తాగునీటి సమస్య కొనసాగుతూనే ఉందని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా మండల కేంద్రం ముదిగుబ్బ పట్టణంలో చాలా ప్రాంతాల్లో నెలకు ఒకసారి కూడా నీటి సరఫరా కాలేదని సిపిఐ నాయకులు శ్రీనివాసులు ఆవేదన చెందారు, కాగా ఈ పరిస్థితిలో గోరుచుట్టుపై రోకటి పోటులా కార్మికులు కూడా నిరవధిక సమ్మెకు దిగితే రాబోయే రోజుల్లో మండలంలో తాగునీటి సరఫరా మరింత దుర్భరంగా మారే అవకాశం ఉందన్నారు, కనుక ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సత్య సాయి కార్మికులకు, ఆరుడబ్ల్యూఎస్ కార్మికులకు వారికి రావాల్సిన జీతాలు చెల్లించి వారు సమ్మెబాట పట్టకుండా తద్వారా మండలంలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు, లేనిపక్షంలో సత్యసాయి కార్మికులు చేపట్టనున్న సమ్మెకు సిపిఐ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు,

Posted Under AP
Editor