ముదిగుబ్బ యస్ 9
మండలం లో క్షయ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ నేతృత్వంలో శ్రీ సత్య సాయి జిల్లా డి ఎల్ ఏ టి ఓ డాక్టర్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముదిగుబ్బ పి హె చ్ సి పరిధిలోని గుంజే పల్లిఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే ఉపయోగించి 95 మందికి తీయడం జరిగింది టీబి సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్ రే ఉపయోగాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ ఎక్స్రే కోసము చాలామంది చాలా దూరము వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి తీయించుకొని వస్తున్నారు అలాంటిది మీ ఊరికే వచ్చి ఎక్స్ రే తీయడం జరుగుతుందిరెండు వారాలకు మించి దగ్గు ఉన్నవారు సాయంత్రం పూట జ్వరం వచ్చేవారు బరువు తగ్గిపోతున్న వారు వారే కాక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశము క్షయ వ్యాధిని దేశము నుండి పారద్రోలడమే దాని కోసము హైరిస్క్ ఏరియాలో గుర్తించి ఆ ప్రదేశాలలోకి ఎక్స్ రే మిషన్లను తీసుకెళ్లి అక్కడ ప్రతి ఒక్కరికి ఎక్స్ రే తీసి క్షయ వ్యాధి ఉంటే వారికి మందులు పెట్టడం జరుగుతుంది ఇలా అందరికీ స్క్రీన్ చేసి క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్రభుత్వము ప్రయత్నము చేస్తున్నది దీనికి ప్రజలందరూ సహకరించి లని కోరుతున్నాము అంతేకాకుండా ఇంటెన్సీ ఫైడ్ టీబి సర్వేలో ప్రతి ఇంటిలో ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు 60 సంవత్సరాలు పైబడిన వారు పాత టీబి రోగులు వారి ఇంటిలోని వారు రక్తపోటు ఉన్నవారు ధూమపానం చేయువారిని ఆల్కహాల్ సేవించు వారిని అందరికీ కూడా గల్ల పరీక్ష మరియు ఎక్స్ రే తీసి వ్యాధి నిర్ధారణ అయితే వారికి మందులు ఆరు నెలలు ఉచితంగా ఇస్తూ వారికి పౌష్టిక ఆహారం కొరకు నెలకు ₹1000 చొప్పున ఆరు నెలలకు 6000 వాళ్ళు బ్యాంకు ఖాతా నందు జమ చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మల్లికార్జున ఎంపీ హెచ్ ఎస్ మురళీధర్ రెడ్డి సి హెచ్ ఓ శృతి ఆరోగ్య కార్యకర్త అనిత కుమారి ఆరోగ్య కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి పి పి ఎస్ ఎ విశ్వనాథ్ ఆశాలు సావిత్రి షీబా రాణి పాల్గొన్నారు
ముదిగుబ్బలో క్షయ నిర్మూలన శిబిరం: ‘హ్యాండ్ హెల్డ్’ ఎక్స్‌రే ద్వారా 95 మందికి టీబీ పరీక్షలు
