అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
___________________________
మావిగన్ కేరాఫ్ ఎర్రగడ్డ ఆసుపత్రి
మావిగన అనే అంశము జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చర్చించుకునే విషయమని మడకశిర శాసనసభ్యులు ఎమ్. ఎస్. రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కనేకల్ రోడ్డు నుంచి పులిచేర్ల గ్రామం వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1.43 కోట్లతో నిర్మించిన రోడ్డును, గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను,, అదేవిధంగా కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 45 లక్షలతో గ్రామంలో నిర్మించిన ఎనిమిది సిసి రోడ్లను ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మడకశిర శాసనసభ్యులు ఎం.ఎస్. రాజు మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యంగస్థరాలు విసిరారు. మావిగన్ అనేది ఎర్రగడ్డ ఆసుపత్రిలో పిచ్చోళ్ళకు ఇచ్చే ఒక రకమైన మందని గూగుల్ ఆన్లైన్లో సర్చ్ చేసి మరీ చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నంతకాలం మూడుముక్కలాడిన దుర్మార్గుడని విమర్శించారు.అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మావిగన్ననే పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విశ్వ నగరాన్ని తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కీర్తి లభిస్తుందనే దుర్బుద్ధితో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
బైట్స్.
1. ఎం.ఎస్. రాజు, మడకశిర శాసనసభ్యులు
