Latest Posts

చంద్రబాబుతోనే పేదరికంలేని సమాజ నిర్మాణం. _కలేకుర్తి సభలో ఎమ్మెల్యేలు.

అనంతపురం జిల్లా రాయదుర్గం

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే పేదరికంలేని సమాజ నిర్మాణం సాకారమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలవ చేపట్టిన “ప్రగతి పండుగ” మంగళవారం కనేకల్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, మడకశిర, పుట్టపర్తి ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పల్లె సింధూర రెడ్డిలు ప్రారంభోత్సవాలు చేశారు. కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేపట్టారు. అదే గ్రామంలో రూ.1.45 కోట్లతో నిర్మించిన తారురోడ్, కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలేకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా, పేదల సంక్షేమమే ఊపిరిగా ఆయన నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒక చారిత్రక అవసరమన్నారు. ఆయన అపారమైన అనుభవం, ముందుచూపు రాష్ట్రానికి శ్రీరామరక్షని, ఆయన మరో 15 సంవత్సరాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని పాలించాలని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆయన సమక్షంలోనే రాష్ట్రం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, ఆయన క్షేమమే రాష్ట్ర క్షేమమని అందరం విశ్వసిస్తున్నామన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజాసేవ చేయటానికి అవసరమైన బలాన్ని, శక్తిని అందించాలని ఉదయం పూట రాయదుర్గంలో దేవతమూర్తులను ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే సాయంత్రం పల్లెల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల ఆశీర్వాదాలు కోరుతున్నామన్నారు. కలేకుర్తి చెరువుకి గత టిడిపి ప్రభుత్వంలోనే నీటిని అందించడం జరిగిందన్నారు. శాశ్విత ప్రతిపాదికన మాల్యం బ్రాంచ్ కాలువ ద్వారా ఈ ప్రాంతంలో ఎనిమిది గ్రామాల పరిధిలో 15 వేల ఎకరాలకు నీరివ్వబోతున్నట్లు వివరించారు. అందుకోసం 36 ప్యాకేజ్ కింద రాయదుర్గం నియోజకవర్గానికి సుమారు రూ.115 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. అలాగే కలేకుర్తి గ్రామానికి .56 కోట్లతో అతి ముఖ్యమైన వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. హెచ్ ఎల్ సి ద్వారా సక్రమ నీటి పంపిణీకి కాలువ ఆధునికరణ పనులకు గత ఏడాది సుమారు రూ.32 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో మరో మూడు దశాబ్దాల పాటు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం జెల్ జీవన్ మిషన్ కింద సుమారు రూ.400 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇన్ని నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి కి బాసటగా నిలుస్తూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ప్రజలు ఇచ్చిన అద్భుత తీర్పుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి మళ్ళీ వేగం పుంజుకుందనీ ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పల్లె సింధూర రెడ్డిలు పేర్కొన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణం నుండి పోలవరం పూర్తి వరకు, పరిశ్రమల రాక నుండి ఐటీ పురోభివృద్ధి వరకు ప్రతి అడుగులోనూ ఆయన మార్కు కనిపిస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారిని ఆర్థికంగా నిలబెట్టే పథకాలను ఆయన ఎంతో చాకచక్యంగా అమలు చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించాలన్నా, నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నిండాలన్నా చంద్రబాబు దార్శనికత అత్యంత అవసరమన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సాగిస్తున్న ఈ ప్రయాణానికి ప్రజలందరూ అండగా నిలవాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వన్నారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు లాలేప్ప, క్లస్టర్ ఇంఛార్జిలు ఆనంద్, మారుతీ, గోపులాపురం బసవరాజు,ఆది, బిటి రమేష్, చాంద్, ముజ్జు,ప్రభాకర్, రైస్ మిల్ చంద్ర, నాగార్జున, మల్లికార్జున ,కురుబ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor