విశాఖ :
విశాఖపట్నం సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నా రు. ఆలయ మర్యాదలతో అధికారు లు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 20న జరగనున్న చందనోత్స వం నేపథ్యంలో సింహగిరి పై ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు మౌలిక వసతులు, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని, సీసీటీవీ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఏఐ టెక్నాలజీ వినియోగంతో పాటు భక్తులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చందనోత్సవం అపురూపమైన ఘట్ట మని, ఈసారి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.
