అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నాగమద్దయ్య గారు ఈ రోజు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన ఎక్సైజ్ కేసులను, ఎక్సైజ్ రెవెన్యూ రాబడిను సమీక్షించారు. అక్రమ మద్యం, నాటు సారా పైన పటిష్ట నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. తదుపరి విడపనకళ్ మండలం నందు సరిహద్దు ప్రాంతంలో ఉన్న విడపనకళ్, డొనేకల్ ఎక్సైజ్ చెక్ పోస్టులను తనికి చేసి కర్ణాటక నుండి వచ్చే వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేయాలని అక్రమ మద్యం రవాణా ను నిరోధించాలని చెక్ పోస్ట్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర, SI వీరస్వామి, checkpost అధికారి శ్రీరాములు, వెంకటేశం లు పాల్గొన్నారు.
– ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఉరవకొండ
