అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం.
- అనంతలో హైటెక్ మోసం.
- నా ఖాతాలో 7 లక్షల కోట్లు ఉన్నాయ్ డ్రా చేసేందుకు అవసరమైన కొంత డబ్బు ఇవ్వండి అవి రాగానే మీకూ అందులో వాటా ఇస్తా అంటూ
అమాయకులకు 3 కోట్లకు పైగా వైసీపీ నేత బురిడీ . - నకిలీ బ్యాంకు స్టేట్మెంట్, ఆర్బీఐ అప్రూవల్ సృష్టి.
- డబ్బులు తిరిగివ్వమంటున్నా, పట్టించుకోని వైనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు అధికారులు.
నా బ్యాంకు ఖాతాలో రూ.7 లక్షల కోట్లు ఉన్నాయి అంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసుకొనేందుకు అవసరమైన కొంత డబ్బు సమకూరిస్తే మీకు కూడా అందులో వాటా ఇస్తా అంటూ సరికొత్త హైటెక్ మోసంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు అమాయకులను బురిడీ కొట్టించాడు.
ప్రజలను నమ్మించేందుకు నకిలీ బ్యాంకు స్టేట్మెంట్తో పాటు తన బ్యాంకు ఖాతాకు ఆర్బీఐ అప్రూవల్ ఉన్నట్లు ఫేక్ ధ్రువ పత్రం సృష్టించిన వైసిపి నాయకుడు ఎర్రిస్వామి. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలతో మోసగించి.. దాదాపు 70 మంది నుంచి రూ.3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గత ఏడాది కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. యూనియన్ బ్యాంక్ బ్రాండ్ ను వాడుకుని హైటెక్ మోసాలకు పాల్పడుతున్న ఎర్రిస్వామి పై యూనియన్ బ్యాంక్ అధికారులు కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఎర్రిస్వామి పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామణి పట్టణ శ్రీ హరినాథ్ మీడియాతో తెలిపారు.
