- కొండ్రవారిపల్లిలో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జన్మదిన వేడుకలు
- ఫాదర్ విగ్రహానికి పూలమాలవేసిపూజలు నిర్వహించిన ప్రజలు
సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కొండ్రవారిపల్లి లో ప్రాథమిక పాఠశాల ముందు ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూల మాలలు వేసి కాయ కర్పూరములకు సమర్పించి పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని నమ్మి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు సీమలో ఆశల విత్తనం నాటి నాటిన మహా శిఖరం ఫాదర్ ఫెర్రర్ గారని, మానవతా మూర్తి పేదల పాలిట ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ శృతి నివాళిలు,ఉమ్మడి అనంతపురం జిల్లాకు దేవుడని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు విద్యా, వైద్యం వసతి ,పాఠశాలలు, చెక్ డ్యాములు, మామిడి తోటలు పెంపకం, రోడ్లు, నిత్యవసర వస్తువులు, బోర్లు తవ్వకం, తదితర ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో దేవుడయ్యారని కొండ్ర వారిపల్లి యందు ఎస్సీ కాలనీ, కొండ్రవారిపల్లి, ఆర్డిటి బీసీ కాలనీలో కేకులు కట్ చేయడం పూజలు నిర్వహించడం జరిగినదని, మారుమూల పల్లె లో ఆర్డిటి సంస్థ కొండ్రావారిపల్లెలో దాదాపు 160 పక్క గృహాలు నిర్మించి ప్రజలకు ఇచ్చిందని రెండు కమ్యూనిటీ హాలులు, ఆవులు, గొర్రెలు, డ్రిప్పులు స్వింకర్లు పంపిణీ చేశారని ఫాదర్ ఫెర్రర్ గారి ఫ్యామిలీ కి మేము ఎంతో రుణపడి ఉన్నామని వారి చిత్రపటాలు పట్టుకొని ఫాదర్ ఫెర్రర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ప్రజలు చిన్నారులు విద్యార్థులు పలకడం చాలా సంతోషకరమని వారు తెలిపారు,
ఈ కార్యక్రమంలో ఆర్డిటి మహిళ గ్రూప్ సభ్యులు చిన్నారులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
