డి హిరేహాల్ మండల పరిధిలోని కాదలూరు గ్రామంలో పరిషత్ పాఠశాలలో రెసోనియా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాదలూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, వాలీబాల్ నెట్‌లు, ఫుట్‌బాల్‌లు తదితర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
మండల కన్వీనర్ కాదులూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు.
రెసోనియా సంస్థ విద్యార్థులకు క్రీడా కిట్లు అందించడం అభినందనీయమని, గ్రామీణ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం కూడా పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పాఠశాలలో వాటర్ ప్లాంట్లు వసతి కల్పించేందుకు సమస్త సహకరించి ముందుకు రావాలని మోహన్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో రెసోనియా సంస్థ ప్రతినిధులు, సంస్థ చీఫ్ మేనేజర్ హరేంద్ర పాండే మేనేజర్ మనోహర్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయికుమార్,మొండి మల్లికార్జున్రెడ్డి ఎం తిప్పారెడ్డి, ఎం పాలక్ రెడ్డి, స్కూల్ చైర్మన్ జడప్ప, జనార్దన్ రెడ్డి, ఎం అనిల కుమార్,పాఠశాల ముఖ్య ఉపాధ్యాయురాలు పద్మ, విద్యార్థి విద్యార్థినిలు తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
