ఈదులపల్లి గ్రామసభలో “జలధార” కార్యక్రమం: నీటి భద్రతపై ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పిలుపు

నేడు ముదిగుబ్బ మండలంలోని ఈదులపల్లి గ్రామసభలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”కార్యక్రమంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు సాగునీటి నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో “జలధార – నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే ప్రత్యేక 100 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 6, 2026లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.చెరువుల పునరుద్ధరణ మరియు పూడిక తీత పనులలో చురుకుగా పాల్గొనడం.
నీటి వృథాను అరికట్టడం మరియు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడటం.నీటి నిర్వహణలో సామాజిక బాధ్యతను పెంపొందించడం. మన రాష్ట్ర వైద్య, విద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వై.సత్య కుమార్ యాదవ్ అన్నగారు దృష్టికి సాగునీరు, రైతన్నల గురించి చెప్పిన వెంటనే ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం మార్గం చూపుతున్న మన మంత్రివర్యులు కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నను.ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ (App) ను కూడా ప్రవేశపెట్టింది, దీని ద్వారా పనుల పర్యవేక్షణ సులభతరం అవుతుంది.”జలధార” పేరుతో చెరువుల్లోకి నీటిని మళ్లించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రవీంద్ర, ఓ బి సి మండల అధ్యక్షులు చంద్రమోహన్, గంగాధర్ రెడ్డి,NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

Posted Under AP
Editor