అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్డిటి ఆవరణంలో గురువారం డిజిహెచ్ ఎస్ వ్యవస్థాపకులు మీనుగా గోపాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు,ఈ వైద్య శిబిరానికి అనంతపురం శ్రీ వర్ష హాస్పిటల్ డాక్టర్ సుప్రజ చౌదరి వారి బృందం ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్యం నిర్వహించారు,ఈ సందర్భంగా డాక్టర్ సుప్రజ చౌదరి,మాట్లాడుతూ డీజీహెచ్ఎస్ వ్యవస్థాపకులు మీనుగ గోపాల్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం మా బృందం చే నిర్వహించడం జరిగిందని,ఈ శిబిరం నందు సాధారణ వైద్య పరీక్షలు,రక్త పరీక్షలు,కంటి పరీక్షలు, డయాబెటిస్,రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు నిర్ధారణ చేయడం జరిగిందని,ఈ వైద్య శిబిరంలో దాదాపు 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు,అనంతరం డిజిహెచ్ఎస్ వ్యవస్థాపకులు మీనుగా గోపాల్ మాట్లాడుతూ పేదల పెన్నిధి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫాదర్ ఫెర్రర్ జయంతి,మరియు నా వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఉరవకొండ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని,ఈ శిబిరం నందు దాదాపు 120 మంది పేద ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందని,ఇలాంటి సేవ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
