తాడిమర్రి(yes9tv)శివంపల్లిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
తాడిమరి మండలంలోని శివంపల్లి గ్రామంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పుట్టినరోజు వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివంపల్లి బీసీ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో వేడుకలు జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ డైరెక్టర్ హనుమంతప్ప, రీజినల్ ఇంజనీర్ మధుసూదన్, సి.ఓ నాగరాజ్ హాజరయ్యారు. అలాగే సి.డి.సి సభ్యులు, అర్వేటి గంగాధర్ పెద్దన్న, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పేర్కొన్నారు.
ఈ వేడుకలను శివంపల్లి ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగలా నిర్వహించడం విశేషం.
శివంపల్లిలో ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు….
