డి. హిరేహాల్ మండల పరిధిలోని గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ‘ రెసోనియా ‘అనే విద్యుత్ సంస్థ బహుకరించిన క్రీడా సామాగ్రిల కిట్లను పంచిపెట్టారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి మాట్లాడుతూ… సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో కొత్తగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్న రెసోనియా అనే సంస్థ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సార్ గారిని కలిసినప్పుడు నియోజకవర్గంలో పలు మండలాల్లో పాఠశాలలకు విద్యార్థినీ విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రి, ఆర్ఓ ప్లాంట్లు, కంప్యూటర్ ల్యాబ్లు, సహాయం చేయమని వారికి తెలిపారు, రాయదుర్గం, డి.హీరేహాల్, కనేకల్ మండలాల పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. గోడిసెలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో వాటిని విద్యార్థి, విద్యార్థినిలకు ఈరోజు అందజేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వేసవి సెలవుల్లో టీవీలు, సెల్ ఫోన్ జోలికి వెళ్లకుండా క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్రీడా సామాగ్రి కిట్లు కేవలం వస్తువులు మాత్రమే కావవి, మీ ప్రతిభపై దాతలకు ఉన్న నమ్మకానికి చిహ్నాలన్నారు. మా సొంత గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్ లకు విద్యార్థినిలు ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక షెడ్డును మరియు ఆరో ప్లాంట్లను నిర్మించాలని కోరారు.సమాజం పట్ల బాధ్యతతో దాతలు ముందుకు వచ్చి అందిస్తున్న సహకారాన్ని అత్యంత జాగ్రత్తగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఎన్ టి పి సి, జిందాల్ లాంటి పెద్ద సంస్థలు కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సామాజిక బాధ్యత కింద ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని ఆయా సంస్థలను కోరామన్నారు. ప్రభుత్వంతో పాటు ఇలాంటి సంస్థల సహకారంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెసోనియా కంపెనీ మేనేజర్ హరేంద్ర పాండే, మనోహర్, నాని సిబ్బంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.రాధ, రామాంజనేయులు, విద్యార్థి ,విద్యార్థినిల తల్లితండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయం…మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి..
