Latest Posts

రాయదుర్గంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్: మైనర్లతో వాహనాలు నడిపిస్తే తల్లిదండ్రులకు రూ. 5 వేల జరిమానా

అనంతపురం జిల్లా , రాయదుర్గం.

రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు… మైనర్ డ్రైవింగ్ చేపించి న వారి తల్లిదండ్రులకు ఫైన్లు విధింపు

* జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు రాయదుర్గం మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు , కళ్యాణదుర్గం డిఎస్పీ శ్రీ రవి బాబు గారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను పెంపొందించే దిశగా రాయదుర్గం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉల్లంఘనదారులపై ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్, అధికలోడ్ తో వెళ్లే వాహనాలకు, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై కేసులు నమోదు చేసి ఫైన్లు విధించారు.
ముఖ్యంగా మైనర్ బాలురు మోటార్ సైకిల్స్ నడిపిన వారికి అవగాహన కల్పించి వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 5000/₹ చొప్పున చలానా విధించడ మైనది.
రాయదుర్గం మండలం వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాయదుర్గం పోలీసులు మాట్లాడుతూ…“ప్రజల ప్రాణ భద్రతే మా ముఖ్య లక్ష్యం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, సురక్షితంగా ప్రయాణించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇలాగే చర్యలు కొనసాగిస్తాం” అని సూచించారు……
ఇట్లు రాయదుర్గం టౌన్ పోలీస్.

Posted Under AP
Editor