అనంతపురం జిల్లా, రాయదుర్గం.
పల్లెపల్లి ZPHS స్కూల్‌లో రిసోనియా కంపెనీ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ
* ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరు
రాయదుర్గం నియోజకవర్గ
అనంతపురం జిల్లా:
రాయదుర్గం మండలం పల్లెపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో రెసోనియా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై విద్యార్థులకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, వాలీబాల్ నెట్‌లు, ఫుట్‌బాల్‌లు తదితర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయని అన్నారు.
రెసోనియా సంస్థ విద్యార్థులకు క్రీడా కిట్లు అందించడం అభినందనీయమని, గ్రామీణ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం కూడా పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అదేవిధంగా రాయదుర్గం 26 కనేకల్ మండలాలలో ఆయా పాఠశాలలో వాటర్ ప్లాంట్లు కంప్యూటర్ ల్యాబ్లు వసతి కల్పించేందుకు సమస్త సహకరించి ముందుకు రావాలని ఎమ్మెల్యేకోరారు
ఈ కార్యక్రమంలో రెసోనియా సంస్థ ప్రతినిధులు, సంస్థ చీఫ్ మేనేజర్ హరేంద్ర పాండే మేనేజర్ మనోహర్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయికుమార్ టిడిపి మండల కన్వీనర్ హనుమంతు మాజీ సర్పంచ్ రాధమ్మ టిడిపి నాయకులు సదాశివరెడ్డి, కాదులూరు మోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ఎంఈఓ లు మామ ఇర్షద్ వెంకట రమేష్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
