Latest Posts

క్షతగాత్రులకు కొండంత అండ: కదిరి బ్రహ్మోత్సవాల ప్రమాద బాధితులకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందికుంట

*కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో గాయపడిన కుటుంబాలకు ఆదుకున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

శ్రీ మత్ ఖాద్రి లక్ష్మినరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం నాడు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గాయపడిన క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా, కాలు కోల్పోయిన విజయ్ శేఖర్ కుటుంబానికి *పచ్చిపులుసు సురేష్ (సూరి) గారి అధ్వర్యంలో* 5 లక్షల రూపాయలు సహాయం అందజేశారు,మిగతా 7మంది వి. కొండయ్య , అనిల్ కుమార్, చల్ల సతీష్,సి. వెంకటేష్, రామాంజనేయులు, వై.ఆంజనేయులు, సీ గంగరాజు ,వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 1లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి గారు,ఆలయ ప్రధాన అర్చకులు ఏ.వి.నరసింహ చార్యులు,ఆర్డీవో వి.వి.ఎస్.శర్మ,డీఎస్పీ శివనారాయణ స్వామి, కుటాగుల్ల గంగరాజు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ రాజశేఖర్ ఆచారి,రామానాయుడు, కునకా పుల్లయ్య, ఏం.ప్రతాప్,లాయర్ సుబ్బరాజు గుప్తా,బీజేపీ నాయకులు కేశవ్ రెడ్డి,తలుపుల గంగాధర్,జన సేన నాయకులు చిల్ల.మహేష్,మల్లె మోహన్,రాము,కిన్నెర మహేష్,లోకేష్,తదితరులు పాల్గొన్నారు
శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం రోజు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో గాయపడిన కుటుంబాలకు ఆయురారోగ్యాలు శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదించాలని YES9 టీవీ తరపున వేడుకుంటున్నాను.

Posted Under AP
Editor