Latest Posts

యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం: పకడ్బందీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఓ.ఆనంద్!

అనంతపురం జిల్లా,తాడిపత్రి.

*గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం..*

– *ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి.*

– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*

– *: యాడికిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర రిహాబిలిటేషన్ & రీ సెటిల్మెంట్ డైరెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..

– *గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాడికి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో.. సీఎం పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీన అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి నీటి భద్రత – సాగునీటి సంఘాల భద్రత పేరుతో నీటి సంరక్షణ 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సంబంధిత కార్యక్రమాల ఏర్పాట్లను రాష్ట్ర రిహాబిలిటేషన్ & రీ సెటిల్మెంట్ డైరెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పరిశీలించారు.*

– *ఈ సందర్భంగా యాడికి మండలం వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో, యాడికి మార్కెట్ యార్డులో, పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద పలు కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.*

– *ముందుగా హెలిప్యాడ్ లో హెలిప్యాడ్ సిద్ధంకాగా, పార్కింగ్, క్యాడర్ మీటింగ్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యాడికి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక వద్ద సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, బ్యారికేడింగ్, మెటీరియల్ సప్లయి, కుర్చీల ఏర్పాటు, డయాస్ ప్లానింగ్, మినిట్ టు మినిట్ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.*

– *పెండేకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అన్ని రకాలుగా ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. ఏపీసీఎన్ఎఫ్ – ఆర్వైఎస్ఎస్ (రైతుకు సాధికార సంస్థ) వారి పిడిఎంఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) కింద బీడు భూములను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా చేపట్టే ప్రకృతి వ్యవసాయం, డ్వామా పరిధిలో ఎన్ఆర్ఈజిఏ కింద బౌండరీ ట్రెంచ్ లు, ఏపీఎంఐపి కింద డ్రిప్ ఇరిగేషన్ పనులు పూర్తిగా చేపట్టాలని ఆదేశించారు. సీఎం పర్యటన కోసం వేగవంతంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.*

– *ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓలు వసంతబాబు, ఆర్బిఎస్కె శ్రీనివాస్, ఎస్డీసి రామ్మోహన్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్.అండ్.బి ఈఈ రాజగోపాల్, డిఎల్డివో విజయలక్ష్మి, డిపిఓ మరియు జడ్పి సిఈఓ నాగరాజు నాయుడు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్ఈ సురేష్, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, పిఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మనాయక్, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, మండల ఎంపిపి రంగయ్య, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor