అనంతపురం జిల్లా,జేఎన్టీయూ.
జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పాల్గొంటారు.
వి.సి. సుదర్శన్ రావు వెల్లడి.
అనంతపురం, ఏప్రిల్ 5:
రేపటి రోజున సోమవారం ఉదయం అనంతపురం జేఎన్టీయూ 15వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హెచ్ .సుదర్శన్ రావు వెల్లడించారు.
ఆదివారం ఉదయం జేఎన్టీయూ ఆర్యభట్ట ఆడిటోరియంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను తెలిపారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ ఆడిటోరియంలో అత్యంత వైభవముగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నాతకోసవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఇప్పటికే విశ్వవిద్యాలయంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో ప్రముఖ విద్యా వేత్త డా. టెస్సీ థామస్
ఫార్మర్ డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టం) డి ఆర్ డి ఓ మరియు NICHE యూనివర్సిటీ కన్యాకుమారి తమిళనాడు గారు గౌరవ అతిథి గా మరియు స్నాతకోత్సవ వక్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
అలాగే వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యూనివర్సిటీ టాపర్లకు గౌరవ చాన్సిలర్ గారి చేతుల మీదుగా 45 బంగారు పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు పి హెచ్.డి పట్టాలు, అర్హులైన స్కాలర్లకు డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారన్నారు.
130 మంది పైగావిద్యార్థులకు జేఎన్టీయూఏ అనుబంధ స్వయం ప్రతిపత్తి మరియు ప్రభుత్వ కళాశాలలో నుండి 40,782 మంది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కార్యక్రమంలో అధికారికంగా పట్టాలను ప్రధానం చేయనున్నట్లు వైస్ ఛాన్స్లర్ తెలిపారు. ఈ సందర్భంగా
గత ఏడాది కాలంలో యూనివర్సిటీ సాధించిన ప్రగతి పరిశోధనలు మరియు ర్యాంకింగ్ వివరాలను గౌరవ వైస్ ఛాన్స్లర్ హెచ్ సుదర్శన్ రావు గారు వార్షిక నివేదికను సమర్పించడం జరుగుతుంది.
బంగారు పతక గ్రహీతలు మరియు పీహెచ్డీ పట్టాదారులు ఉదయం 8.30 గంటలకు నిర్ణీత దుస్తులతో వేదిక వద్దకు చేరుకోవాలని అనంతరం రిహాల్సల్స్ లో పాల్గొనాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఆడిటోరియంలోకి ప్రవేశం ఉండదని ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఆడిటోరియంలోకి ఆహ్వాన పత్రిక లేదా ఎంట్రీ పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని భద్రత దృశ్య సెల్ఫోన్లో కెమెరాలు అనుమతించబడమని స్పష్టం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా యూనివర్సిటీ అధికారిక యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్సైట్( jntua.ac.in)(https://www.jntua.ac.n) ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చునని తెలిపారు.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో
యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రొఫెసర్ దేవన్న, డైరెక్టర్ ఆఫ్ ఎమ్మెల్యేషన్స్ నాగ ప్రసాద్, డి ఎ పి ప్రొఫెసర్ ఎస్. వి. సత్యనారాయణ,
పి ఆర్ ఓ ప్రొఫెసర్ ఓం ప్రకాష్
తదితరులు పాల్గొన్నారు.
