జేఎన్టీయూలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లు: పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్!

అనంతపురం జిల్లా,జేఎన్టీయూ.

గౌరవ రాష్ట్ర గవర్నర్ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్

అనంతపురం, ఏప్రిల్ 5
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గారు రేపటి ఉదయం సోమవారం జేఎన్టీయూ అనంతపురం 15వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో ఆయా కార్యక్రమాల ఏర్పాట్ల పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ముందుగా జేఎన్టీయూ అతిథి గృహం పరిశీలించిన అనంతరం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జేఎన్టీయూ మరియు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు సమన్వయ సహకారాలతో గౌరవ గవర్నర్ కార్యక్రమాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు. పెండింగ్ పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు.

అనంతపురం ఆర్ డి ఓ కేశవ నాయుడు, బుక్కరాయసముద్రం తాసిల్దార్ శ్రీధర్ మూర్తి, సి ఎస్ డి టి సుబ్రమణ్యం, జేఎన్టీయూ ఉద్యోగ సిబ్బందిది తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor