శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పట్టణంలోని ఆక్సి్ఫార్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలకు భారీ స్పందన లభించింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో సుమారు 80 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను పరిశీలించిన ఎంపిక కమిటీ సభ్యులు ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అన్ని అర్హతలు కలిగిన కొందరు అభ్యర్థులు ప్రాథమికంగా సెలెక్ట్ చేయబడినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ఎంపికైన వారికి త్వరలోనే నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం ఆనందకర విషయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు కళాశాల సిబ్బంది సహకరించారు.
ముదిగుబ్బ ఆక్స్‌ఫార్డ్ విద్యాసంస్థల్లో ముగిసిన జాబ్ ఇంటర్వ్యూలు: నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన!
