Latest Posts

ఆసుపత్రి వ్యర్థాల ఉత్పత్తి తగ్గాలి -డా.మల్లీశ్వరి

అనంతపురం జిల్లా.

 

అనంతపురం: వైద్యం: ఆసుపత్రిలో అంతిమ వ్యర్థాల ఉత్పత్తి తగ్గించేలా చూడడమే జీరో టు వేస్ట్ లక్ష్యమని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మల్లీశ్వరి తెలిపారు
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర మార్చ్ నెల కార్యక్రమం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురంలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ జీరో వేస్ట్ యొక్క ప్రధాన సూత్రాలైన
చెత్త కు కారణం అయ్యేవాటిని నిరాకరించడం (రిఫ్యూజ్), వ్యర్థాల ఉత్పత్తిని మూలంలోనే తగ్గించడం(రెడ్యూస్), వస్తువులను మళ్లీ మళ్లీ ఉపయోగించడం (రీ యూస్), పునర్వినియోగపరచగల వ్యర్థాలను (రీసైక్లింగ్), వ్యర్థాల నుంచి ఇతర ఉపయోగాలు పొందడం లేదా కొత్త ఉత్పత్తులుగా పునరుద్ధరించడం( రీకవర్), సేంద్రీయ వ్యర్థాలను రాట్ కంపోస్ట్‌గా మార్చి ఎరువుగా ఉపయోగించడం వంటి 6 ఆర్ ల అమలుకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రత అభియాన్, వ్యర్థాల సేకరణ, అవగాహన బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శన మరియు పాల్గొన్నవారందరికీ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ఆర్ ఎం ఓ డా. హేమలత గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలా బాయి గారు, శానిటేషన్ సెక్యూరిటీ నోడల్ ఆఫీసర్ డా నారాయణ స్వామి, డైటిషియన్ బాలనరసింహులు, హెడ్ సిస్టర్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిస్టర్స్, మినిస్టీరియల్ సిబ్బంది ట్రైనింగ్ నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor