Latest Posts

యూరియా కలిపిన నీరు త్రాగి 20 గొర్రెల మృతి

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.

 

మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. యూరియా కలిసిన నీటిని త్రాగి సుమారు 20 గొర్రెలు మృతి చెందాయి. ఓబులపతికి చెందిన గొర్రెల కాపరి ప్రతిరోజులాగే గొర్రెలను సమీపంలోని పొలాలకు మేతకు తీసుకెళ్లగా మధ్యాహ్నం సమయంలో అవి ఒక్కసారిగా అస్వస్థతకు గురై నురగలు కక్కుతూ కుప్పకూలిపోయాయి. కాపరి గమనించేలోపే కొద్దిసేపట్లోనే అన్ని గొర్రెలు మృతి చెందాయి.
సమాచారం అందుకున్న పశువైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృత గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. యూరియా కలిసిన నీరు త్రాగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా.
జీవనాధారాన్ని కోల్పోయిన బాధిత కాపరిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు, గొర్రెల కాపరుల సంఘం నాయకులు కోరుతున్నారు.

Posted Under AP
Editor