జిల్లా : కర్నూలు
సెంటర్ : ఆలూరు.
ఆలూరు, మార్చి 28:
ఆలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ల విషయంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
ఈ అంశంపై టీడీపీ మరియు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది…
టెండర్ల కేటాయింపులో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక దశలో ఈ వాగ్వాదం తోపులాటకు దారి తీసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
