Latest Posts

తాడిమర్రిలో చెత్త సేకరణ సైకిళ్ల పంపిణీ: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన అధికారులు

తాడిమర్రి (yes9tv)తాడిమర్రి మండలంలో చెత్త సేకరణ సైకిల్లు పంపిణీ కార్యక్రమం
ధర్మవరం, మార్చి 28: తాడిమరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం చెత్త సేకరణ సైకిల్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చెత్త సేకరణ సైకిళ్లతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రత, చెత్త నిర్వహణ విధానాలు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమాన్ని ఎంపీడీవో రంగారావు, డిప్యూటీ ఎంపీడీవో విజయ శేఖర్ నాయుడు, ఎమ్మార్వో భాస్కర్ రెడ్డి, తాడిమర్రి పంచాయతీ కార్యదర్శి రిజ్వానా, జనసేన మండల అధ్యక్షుడు మోహన్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, మండల ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Posted Under AP
Editor