Latest Posts

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరంగల్ వాసులు మృతి!

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, శేషాపురం వద్ద నిలిపి ఉంచిన ఒక ARTTC బస్సును వెనుక నుండి ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మి మరియు అద్విక్‌లుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుండి తిరుమలకు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Posted Under AP
Editor