అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
*అనంతపురం జిల్లాలో దారుణం భర్తను చంపి ఇంటి ముందే పాతిపెట్టిన భార్య*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన శుక్రవారం బయటపడింది.
గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం… మృతుడు హనుమంతు (35)కు సుకన్యతో 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. హనుమంతు స్వస్థలం బెలుగుప్ప మండలం హనుమరెడ్డి పల్లి కాగా, వివాహానంతరం పాతచెరువులోనే నివసిస్తున్నారు.
నాలుగు నెలల క్రితం హనుమంతు కనిపించడం లేదని సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే గురువారం సుకన్య, ఆమె కుమార్తె అమృత మధ్య జరిగిన గొడవతో అసలు విషయం బయటపడింది.
కూతురు ప్రేమ వ్యవహారంపై తల్లి అడ్డుపడటంతో జరిగిన వాగ్వాదంలో, తండ్రిని తల్లే హత్య చేసిందని కుమార్తె వెల్లడించినట్లు సమాచారం. దీంతో విషయం బయటకు వచ్చి, నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
