శ్రీ రాముని జీవితం గాథను ,పరిపాలన దార్శనికతను నేటి ఆదర్శ ప్రాయంగా భావించాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులకు ఆదర్శ ప్రాయుడు , ధర్మ పరిపాలకుడు శ్రీ రామ చంద్రమూర్తి. శ్రీ రామ నవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ హిందూ బంధువులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ వాసవి వనిత మరియు వాసవి క్లబ్ వారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నుంచి నిర్వహిస్తున్న ద్విచక్ర వాహన ర్యాలీలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి మరియు ధర్మ క్షేత్రం తరపున కదిరి పట్టణ వీధుల్లో ” జైశ్రీరామ్, ” జైశ్రీరామ్” ” రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి ” అంటూ శ్రీ రామ చంద్ర ప్రభువు నామాస్మరణతో ర్యాలీలో పాల్గొనడం జరిగింది.కదిరి పట్టణంలో మత సామరస్యతో ముస్లీం సోదరులు సైతం శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ ర్యాలీలో పాల్గొనడం మత సమరస్యతకు తార్కాణం. శ్రీ రామ చంద్రమూర్తి పరిపాలన దక్షతను,శ్రీ రామాయణ జీవితగాథ మరమార్థం నేటి యువత అలవర్చుకొని ఆదర్శ ప్రాయమైన జీవితం గడపాలని,ఇదే విధంగా ప్రతి ఏటా శ్రీ రామ నవమి ఘనంగా నిర్వహించి హిందువుల ఐక్యతను చాటాలని శ్రీ వాసవి వనిత మరియు వాసవి క్లబ్ నిర్వాహకులు ఆకాంక్షించారు.శ్రీ రామ నవమి సందర్భంగా ద్విచక్ర వాహన ర్యాలీని జెండాను ఊపి ప్రారంభించిన కదిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యులు మిట్టా పార్థ సారథి మరియు నిర్వాహకులు.
శ్రీరామనవమి పండుగ రోజు మన కదిరిలో ఇంత పెద్దగా హైందవ ధర్మాన్ని చాటి చెప్పిన మన కదిరి పట్టణ హైందవనీకానికి, మరియు ఇందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు, ద్విచక్ర వాహన ర్యాలీని జండా ఊపి ప్రారంభించిన కదిరి మాజీ శాసనసభ్యులు పార్థసారధి గారికి YES9 టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను.
