…రేణుమాకులపల్లి దాడి కేసులో
ఆరుగురి పై కేసు నమోదు…
ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామములో శుక్రవారం రోజున తేదీ 20.03.2026 వ తేదీన
ఒక వర్గం పై దాడి చేసి వారి గృహాపకరణాలను , వాహనాలను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలుగ చేసి వారిపై హత్యయత్నం గలాటా కు సంబందించి, ఉరవకొండ యూపిఎస్ యందు రిజిస్టర్ కాబడిన కేసు ఆదారంగా 23.03.2026 న అరెస్ట్ కాబడిన 6 గురు ముద్దాయిలను రాజశ్రీ ఉరవకొండ కోర్టు వారి ఆదేశాలతో రిమాండ్ కు పంపడమైనది, పరారీలో ఉన్న ముద్దాయిలలో ఈ దినం అనగా 27.03.2026 వ తేదీన మద్యాహ్నం 12.30 గంటలకు రేణుమాకులపల్లి గ్రామానికి చెందిన బోయ శ్రీకాంత్ A-4, బోయ రవి A-5, బోయ పెద్ద తిప్పయ్య A-7, బోయ సుంకన్న A-8, బోయ లింగరాజు A-10, బోయ శివ A-12, అను వారిని బుదగవి గ్రామము మారెమ్మ గుడి వద్ద అరెస్ట్ చేసి వారి దగ్గరి నుండి ఒక స్కార్పియో ను అందులో నేరానికి ఉపయోగించిన 5 కట్టెలను మరియు మూడు రాళ్ళను సీజ్ చేసి అరెస్ట్ చేయబడిన ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం రాజశ్రీ ఉరవకొండ కోర్టు నందు హాజరుపరచడమైనది.
