Latest Posts

ముదిగుబ్బలో కనుల పండువగా సీతారాముల కల్యాణం: వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. అంగరంగ వైభవంగా వేడుకలు

శ్రీరామనవ పండుగ సందర్భంగా మండల కేంద్రమైన ముదిగుబ్బ పాత ఊర్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా గతం కంటే మిన్నగా పాత ఊరు గ్రామస్తులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఉదయం 8 గంటలకు సీతమ్మవారి తాలుబొట్టు ఊరేగింపు కార్యక్రమం తో మొదలై అనంతరం ఎదుర్కోలు ఉత్సవం తర్వాత ఉదయం 11 గంటల నుంచి ఈ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిపించారు, ఆంజనేయ స్వామి దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ పూజారి రంగాచారి, తిరుమల వేద పాఠశాలకు చెందిన నరసింహచారి ల వేదమంత్రాల నడుమ జరిగిన
ఆ కోదండ రాముడు,
జానకి దేవిల వివాహాన్ని కనులారా చూసి భక్తులు తరించారు,
ఈ కార్యక్రమానికి మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణ నలుమూలల నుంచే గాక సమీప గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు, ముఖ్యంగా మహిళా భక్తులు ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో తరలి రావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది, ఈ సందర్భంగా శుక్రవారం ముదిగుబ్బ పాత ఊర్లోని ఆంజనేయస్వామి గుడి పరిసర ప్రాంతాలు వేలమంది భక్తులతో కిటకిటలాడాయి,
ఈ మేరకు దాదాపు 6000 మందికి పైగా భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు అంచనా వేశారు, కాగా
ఈ కార్యక్రమంలో
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముదిగుబ్బ పట్టణ సిఐ శివరాముడు ఆదేశాల మేరకు
ఎస్సై కేతన్న,
ఏఎస్ఐ బాబు నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు,

Posted Under AP
Editor