Latest Posts

ఉరవకొండలో యుటిఎఫ్ ‘రణభేరి 3.ఓ’: పెండింగ్ డిమాండ్ల సాధనకై తహసిల్దార్ కార్యాలయం ముందు భారీ నిరాహార దీక్ష

ఈరోజు ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో యుటిఎఫ్ రణభేరి 3.ఓలో భాగంగా ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం ముందర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్ నాయకులందరికి యుపిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు దీక్షా శిబిరాన్ని అధ్యక్షులుగా జిల్లా కార్యదర్శి సంజీవ్ కుమార్ గారు వ్యవహరిస్తూ దీక్షా శిబిరం ప్రారంభించబడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ వి కోటేశ్వరప్ప గారు జిల్లా కేంద్రం నుండి విచ్చేసి నిరాహార దీక్ష శిబిరం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలపడానికి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు క్లిష్టప్ప గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణమూర్తి మధుసూదన్ రంగారెడ్డి గారు విచ్చేసి మద్దతు తెలియజేశారు.
ఈ దీక్షా శిబిరంలో నిరాహార దీక్షలో పాల్గొన్నవారు రామప్ప చౌదరి సంజీవ కుమార్ శేఖర్ బండయ్య శ్రీనివాసులు ఉమాపతి జయ రాములు చంద్రమోహన్ రాంబాబు శ్రీనివాస గుప్తా సుధాకర్ శ్రీధర్ మధుబాబు రఘు లక్ష్మీనారాయణ ఆంజనేయులు మల్లికార్జున ఇస్లాంబాష 18 మంది పాల్గొన్నారు
డిమాండ్లు
1. పిఆర్సి కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలి
2. 29 శాతం ఐ . ఆర్ వెంటనే ప్రకటించాలి పెండింగ్ డిఏలు విడుదల చేయాలి
3. ఉద్యోగుల పెన్షనర్ల బకాయిల చెల్లింపుకు రూట్ మ్యాప్ ప్రకటించాలి
4. సిపిఎస్ రద్దు చేయాలి మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలి.
5. హెల్త్ కార్డుల మెడికల్ బిల్ల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
6. కోవిడ్ సమయంలో మరణించిన 9503 పంచాయతీరాజ్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలి.

Posted Under AP
Editor