Latest Posts

అనంతపురం కలెక్టరేట్‌లో వైభవంగా ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది వేడుకలు: జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామన్న కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం జిల్లా కలెక్టరేట్

ఘనంగా ఉగాది వేడుకలు

అనంతపురం, మార్చి 19:

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో గురువారం ఉదయం ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లాస్థాయి వేడుకల్లో భక్తి గేయాలపన పంచాంగ శ్రవణం, సాంప్రదాయ నృత్య ప్రదర్శన , కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఓ . ఆనంద్ పాల్గొని ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని
ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అంతకు ముందు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతి వెలిగించి ఉగాది వేడుకలను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంచుకున్న రంగాలలో విజయం సాధించాలని మంచి సంకల్పంతో చేపట్టే కార్యాలలో శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు తన వంతుగా కృషి చేస్తామన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధనలో అనంత జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని ఆ దిశగా కార్యాచరణలతో ముందుకెళ్లడానికి ప్రతి ఒక్కరు అంకుటిత దీక్షతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృడసంకల్పంతో ఉన్నారని వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని , ఉగాది పండుగను పురస్కరించుకొని సంక్షేమం మరియు అభివృద్ధి పురోగతిలో మనమే ముందు ఉండే విధంగా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నమార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లాపల్లవిప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. అర్హులందరూ ప్రభుత్వ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయి బ్రాహ్మణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్, రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్
డైరెక్టర్లు ఆదినారాయణ, కొండన్న లు కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి వేరువేరుగా మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది తెలుగు వారందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని
మన దేశం ,రాష్ట్రం, జిల్లా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలని ప్రజలందరి కూటమి ప్రభుత్వంపై ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని డైరెక్టర్లు ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులు కలెక్టర్ కు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ వేడుకల్లో శ్రీమతి మాధురి, భక్తి గేయాలపన, సభి కులసాంప్రదాయ దుస్తుల వస్త్రధారణలు, కవులు జూటూరి తులసీదాస్ సీతారామ ప్రసాద్ ,నర్సిరెడ్డి, నాగవేణి ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఉగాది కవి సమ్మేళనం చిన్నారి, ఓజస్విని, లాలిత్య ల సాంప్రదాయ నృత్య ప్రదర్శన, రిలీస్ స్కూల్ విద్యార్థినీల జానపద నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు వేద పండితులు సీతారామ మోహన్ శర్మ ద్వారా పంచాంగ శ్రవణం సందేశం తెలుగు సంస్కృతి ఉట్టి పడేవిధంగాఆకట్టుకున్నాయి.
ప్రభుత్వ ఆదేశం మేరకు దేవా దాయా శాఖ ఆధ్వర్యంలో వేదపండితులకుపురోహితులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఎల్లనూరు మండలం బుక్కా పురం గ్రామానికి చెందిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వేద పండితులు శ్రీ అర్చకం ప్రసాద్ శర్మ, శ్రీ పండమేటి వెంకటరమణ స్వామి దేవస్థానం రాప్తాడు పూజారి జగన్నాథమయ్య అర్చకులు, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రాయదుర్గం అర్చకులు మడకశిర పద్మనాభ భట్టార్, శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి దేవస్థానం శ్రీ చాగంటి లక్ష్మణాచార్యులు అర్చకుల వారికి ప్రభుత్వం ద్వారా నగదు రూ. 10, 116 లను ప్రోత్సాహకంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించిన నృత్య బృందాలకు, కవులకు కూడా ఘనంగా సన్మానం జరిగింది.
పంచాంగ శ్రవణం ఈ విధంగా ఉంది….
ప్రముఖ వేద పండితుడు సీతారామమోహన్ శర్మ తన పంచాంగం ద్వారా వివరిస్తూ… తొలుత షడ్రుచుల సమ్మేళనం మేలు కలయికగా ఉగాది పచ్చడిలో లభిస్తోందని జీవితంలో ఎలాంటి సంఘటనలు సన్నివేశాలు ఎదురైనా అన్నింటిని సమభావంతో స్వీకరించాలన్నది ఈ పచ్చడి సేవించడంలోని అంతర్యం అని పేర్కొన్నారు.
అలాగే నేడు ప్రారంభమైన శ్రీ పరాభవ నామ సంవత్సరాది ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయని పేర్కొన్నారు. అనంతరం వివిధ రాశుల విశ్లేషణలను తెలియజేశారు. ఇందులో కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి….
సమాజంలో వ్యక్తిత్వ వికాసంతో మెలిగే సుప్ర ప్రదమైన సమయం , విద్యార్థులు ఉన్నత విద్యతో జ్ఞానాభివృద్ధి సాధిస్తారని, దేశం ,రాష్ట్రం , జిల్లా సుభిక్షంగా అన్ని రంగాలలో వృద్ధి చెందుతుందని రైతులకుమేలుజరుగుతుందని ఉద్యాన పంట రైతులు లబ్ధి పొందుతారనిఉద్యోగులు అన్ని సదుపాయాలను పొందుతారని వ్యాపారులకు ఆర్థికంగాప్రగతికలుగుతుందని, సృజనాత్మకతపరిశోధనల్లో విజయం ,వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి ఆదాయమార్గాలుపెరుగుతాయని తదితర అంశాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మాలోల, ఎస్ డి సి ఆనంద్, జిల్లా టూరిజం శాఖ అధికారి జయకుమార్, దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్, అన్ సెట్ మేనేజర్ శ్రీనివాసులు, డ్వామా పిడి సలీం భాష,డి ఆర్ డి ఎ పిడి శైలజ, రిటైర్డ్ ప్రొఫెసర్ డా.సుధాకర్ పలువురు కళాకారులు, అధికారులు , ఉద్యోగులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor