తాడిమర్రి (yes9tv)
నాయనపల్లి రైతులకు రూ.30 లక్షల నష్టం
తాడిమరి మండలంలోని నాయనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు కలిసి సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట పూర్తిగా నేలకొరిగింది.
రైతులు తొట్టి వీరనారప్ప, చిన్న వీరనారప్ప, శ్రీరాములు, నారాయణస్వామి, గంగయ్య, రాము, నారాయణ, వరదప్ప, వీరనారప్ప తదితరులు సంయుక్తంగా సాగు చేసిన పంట గాలివాన బీభత్సానికి పూర్తిగా దెబ్బతింది. పండ్లతో నిండిన అరటి మొక్కలు నేలకొరిగి, పంట పూర్తిగా పనికిరాని స్థితికి చేరింది.
ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతల కారణంగా ఎగుమతులు తగ్గిపోవడంతో అరటి ధరలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన ప్రకృతి విపత్తు రైతులకు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఈ ఘటనలో దాదాపు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితిలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణమే పంట నష్టపరిహారం అందించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు.
అకాల వర్షం – ఈదురు గాలులతో అరటి పంట నేలమట్టం
