తాడిమర్రి (yes9tv)
తాడిమరి మండలం దాడితోట గ్రామానికి చెందిన కౌలు రైతు రమణారెడ్డి సాగుచేసిన మొక్కజొన్న పంట అకాల వర్షం, గాలివాన బీభత్సానికి పూర్తిగా దెబ్బతింది. రైతు రమణారెడ్డి సుమారు 1.5ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేయగా, బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో పంట మొత్తం నేలకొరిగినట్లు తెలిపారు.
ఈ ఘటనతో రైతుకు సుమారు రూ. 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడి మొత్తం వృథా కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రైతు రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని ఆయన కోరారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
అకాల వర్షం, గాలివానతో మొక్కజొన్న పంట నేలకొరిగింది – రైతు రమణారెడ్డి ఆవేదన
