అనంతపురం జిల్లా
*గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి*
– *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
అనంతపురము, మార్చి 18:
– *రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులకు సూచించారు.*
– *బుధవారం సాయంత్రం అనంతపురము కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ నందు గుత్తికోట వారసత్వ ఉత్సవాలు 2026 కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములైన అధికారులను సముచితంగా సన్మానించి దిశా నిర్దేశం చేశారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరు అధికారులు సమిష్టిగా కృషి చేశారన్నారు. తాను సబ్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో కాకినాడ బీచ్ ఫెస్టివల్ నిర్వహణ చాలా బాగా జరిగిందన్నారు. తాను కలెక్టర్ల సదస్సు ఉన్న నేపథ్యంలో జేసీ పూర్తి బాధ్యతగా అధికారులతో టీమ్ వర్క్ చేయించి విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు జరుపుకున్న గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు 2026 ని దిగ్విజయం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.*
– *జేసి సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ గుత్తి కోట వారసత్వ ఉత్సవాలు 2026 కార్యక్రమాన్ని అందరు అధికారులు సమిష్టిగా సమన్వయంతో విజయవంతం చేశారని, అధికారులు, సిబ్బంది తదితరులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.*
– – *ఈ కార్యక్రమ వివరాలను జిల్లా పర్యటక శాఖ అధికారి జయకుమార్ వివరించారు.*
– *అనంతరం జిల్లా కలెక్టర్, జేసి ని పర్యాటక శాఖ అధికారులు సన్మానించారు. తదుపరి అధికారులను కలెక్టర్ జేసి సన్మానించారు.*
– *ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఆర్కియాలజీ ఏడి స్వామి నాయక్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఐ.అండ్.పిఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, డ్వామా పిడి సలీం భాష, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.రవి, ఏపీఎమ్ఐపి పిడి రఘునాథ్ రెడ్డి, గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, డిఎస్డివో మంజుల, పలువురు జిల్లా, మండల అధికారులు, వారి సిబ్బంది, గుత్తి కోట ఉత్సవాలలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.*
