అనంతపురం జిల్లా కలెక్టరేట్
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
– : వేసవిలో ఎలాంటి సమస్య రాకుండా తాగునీటి సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి
– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం, మార్చి 18 :
– ఆయా ఇంజనీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్.అండ్.బి, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్, మైనర్ ఇరిగేషన్, ఇతర ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఇంజనీరింగ్ సెక్టార్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న బ్రిడ్జిలు, బిటి రోడ్లు, తదితర అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్.అండ్.బి పరిధిలో జరుగుతున్న 17 రకాల రహదారుల పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో వేసవి నేపథ్యంలో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో పీఏబీఆర్ నుంచి మంచినీటిని అందజేసేలా చూడాలని, అవసరమైన నీటిని బఫర్ గా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేసవిలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని, తాగునీటి సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎల్సీ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పరిధిలో ఇంజనీరింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
– ఈ సమావేశంలో ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్, పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, ఆర్.అండ్.బి ఈఈ రాజగోపాల్, ఆయా ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
