కందుకూరు లేఅవుట్ లో జూన్ లోపు పనులన్నీ పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
అనంతపురం, మార్చి 18 :
– కందుకూరు లేఅవుట్ లో చేపడుతున్న పనులన్నీ జూన్ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్ లో జరుగుతున్న పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
– ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కందుకూరు అహుడా లేఅవుట్ లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాల) పనులు జరుగుతుండగా, ఇందులో డ్రైనేజీలు, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లై, మరియు పార్క్ ఓపెన్ స్పేస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపడుతుండగా, వాటిని త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వచ్చే జూన్ లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పక్షం రోజులకు ఒకసారి నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అహుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుష్యంత్, మరియు డిఈ రేవంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
