Latest Posts

అనంతపురం జిల్లా ప్రజలకు ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు మరియు అధికారులు

అనంతపురం జిల్లా

జిల్లా ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

అనంతపురము, మార్చి 18 :

– జిల్లాలోని ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలను గౌ.జిల్లా ఇంచార్జి మంత్రి మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గౌ. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసన మండలి సభ్యులు, ఎంఎల్ఏ లు, జేసి సి.విష్ణుచరణ్, డిఆర్ఓ మలోల, తదితరులు తెలిపారు.

– తెలుగువారు జరుపుకునే ఈ ఉగాది పండుగను మనం తెలుగు సంవత్సరాదిగా సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటామని, సహృద్భావ వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవాలని తెలిపారు. ఉగాది పచ్చడిని ఆరు రుచుల (తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు) సమ్మేళనంతో తయారుచేసే ఈ ప్రసాదం ఎంతో విశిష్టమైనది అని అన్నారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సిరి సంపదలతో తుల తూగాలని, వారికి అంతా మంచే జరగాలని వారు ఆకాంక్షించారు.

Posted Under AP
Editor