Latest Posts

దివ్యాంగులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆత్మీయ విందు

అనంతపురం జిల్లా

 

– దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా దివ్యాంగులకు తన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ.. తాజాగా తీసుకొచ్చిన దివ్యాంగ శక్తి పథకం అనంతపురంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి, బండారు శ్రావణి, ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతోపాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దివ్యాంగులు ప్రయాణించే బస్సును జెండా ఊపి ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రారంభించారు. అలాగే వారంతా దివ్యాంగులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ పథకం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి.. గతంలో పరిస్థితి ఎలా ఉండేదన్న అంశాల గురించి ఎమ్మెల్యే దగ్గుపాటి తెలుసుకున్నారు. దివ్యాంగుల బస్సులు నేరుగా ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం వరకు వెళ్లాయి. అక్కడ ఎమ్మెల్యే తన కార్యాలయంలో వారిందరికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దివ్యాంగులను సాదరంగా ఆహ్వానించి.. స్వయంగా భోజనం వడ్డించారు. వారితోనే కలిసి ఎమ్మెల్యేతో పాటు ఛైర్మన్ పూల నాగరాజు భోజనం చేశారు. తమ పట్ల చూపుతున్న చొరవకి దివ్యాంగులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor