Latest Posts

కలెక్టరేట్ లో దివ్యాంగులతో జిల్లా కలెక్టర్, సింగనమల ఎమ్మెల్యే, తదితరుల సహపంక్తి భోజనం

అనంతపురం జిల్లా

 

– అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద దివ్యాంగులతో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ ఎం.కేశవరెడ్డి, తదితరులు సహపంక్తి భోజనం చేశారు. బుధవారం అనంతపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో “దివ్యాంగ శక్తి” (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, అనంతరం దివ్యాంగులతో కలిసి బస్టాండ్ ప్రాంగణం నుంచి కలెక్టరేట్ వరకు ఉచిత బస్సులో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, తదితరులు ప్రయాణించారు. తదనంతరం రెవెన్యూ భవనం వద్ద దివ్యాంగులతో కలిసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, దివ్యాంగులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor