Latest Posts

అనంతపురం జయప్రకాష్ నారాయణ పాఠశాలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ….

అనంతపురం జిల్లా

  • మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోతే.. ఏజెన్సీల మార్పు తప్పదు
  • అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
  •  నగరంలోని జయప్రకాష్ నారాయణ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు

అనంతపురం, మార్చి 18 :

– ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోతే ఏజెన్సీల మార్పు తప్పదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం అనంతపురం నగరంలోని జయప్రకాష్ నారాయణ మున్సిపల్ పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలు పరిశీలించారు. విద్యార్థులనడిగి అక్కడ సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందన్నది రుచి చూశారు. కొన్నిసార్లు భోజనం సరిగా లేదని.. విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. మరోసారి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే ఏజెన్సీలు మార్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుడు భోజనం ఎలా ఉందనేది రూచి చూసి అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఎంఈఓ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంఈఓ కూడా ప్రతి వారం రెండు మూడు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. ఇక నుంచి తాను కూడా ప్రతి వారం ఎక్కడో ఒకచోట ఆకస్మిక తనిఖీలు ఉంటాయని చేస్తానని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చాక.. విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ.. మెగా డీఎస్సీని విడుదల చేశారన్నారు. గత ఐదేళ్లలో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని విమర్శలు చేశారు. ఇప్పుడు మరో డీఎస్సీ ద్వారా 3500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం భోజనానికి గతంలో దొడ్డు బియ్యం ఉండేదని.. ఇప్పుడు సన్న బియ్యం తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67లక్షల మంది పిల్లలకు పదివేల చొప్పున 10 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ బడ్జెట్ లో కూడా 38 వేల కోట్ల రూపాయలు విద్యాశాఖకు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే.. ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి హెచ్చరించారు. ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఎంతో ఓపిగ్గా పిల్లలతో చాలా సేపు మాట్లాడి వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారన్నారు. ఆయన చొరవ అభినందనీయమన్నారు. ఈరోజు ఏపీలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పట్ల దేశంలోనే అన్ని రాష్ట్రాలు ఇటు వైపు చూస్తున్నాయన్నారు. ఒక విజనరీ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor