ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: కదిరిలో ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం!

కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా
కదిరి నియోజవర్గం

​ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10,11 వార్డుల సంబంధించిన ‘ప్రజా దర్బార్’ రాయచోటి రోడ్డు సిరి కల్చర్ ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను.

​ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది.

దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను.

​ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లడమే లక్ష్యంగా, ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు నా కృషి కొనసాగుతుంది.

Posted Under AP
Editor