వైభవంగా ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు: తీర్థవాదిలో పోటెత్తిన భక్తజనం

ఖాద్రి శ్రీవారికి చక్రస్నానం, అభిషేకాలు, ఖాద్రి సుని ఉత్సవాల చివరి రోజున తీర్థవాదిలో కిక్కిరిసిన తిరుగు వీధులు, ఖాద్రీ నరసింహుని ఇలవేల్పుగా కొలిచే భక్తులు కంకణాలు తీశారు, శ్రీవారి ఖాద్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అనగా గురువారం తీర్థవాది నిర్వహించారు. ఉత్సవాలకు అంకురార్పణ జరిగిన నాటి నుంచి యాగశాలలోని కొలువుతీరిన శ్రీవారు గురువారం ఆలయ ప్రవేశం చేసిన ఉదయం నిత్య పూజ అనంతరం శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీవారు ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పడమర దిక్కున ఉన్న భృగుతీర్థం వరకు శ్రీవారిని ఊరేగిస్తూ అధికారులు, ఉద్యోగులు, భక్తులు అన్న భేదం లేకుండా ” గోవిందా” “గోవిందా ” రంగులు చల్లుకుంటూ వెళ్లారు. తరువాత శ్రీవారికి వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ చక్రస్నానం, అభిషేకాలు చేశారు. తరువాత శ్రీవారు పుష్పయాగోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.అనంతరం శ్రీవారిని తిరువీధుల గుండా ఆలయ ప్రవేశం గావించారు. ఖాద్రి శ్రీవారిని ఇలవేల్పుగా కొలిచే భక్తులు తీర్థవాది రోజు కానుకలు సమర్పించడం ఆనవాయితీ, ఇందుకోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. శ్రీవారికి చక్రస్నానం అనంతరం శ్రీవారు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ద్వారాలు మూసివేసి అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. శుక్రవారం నుండి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు, ఉభయ దారులు తాయి సుదర్శన్, తాయి ప్రభాకర్ గుప్తా, తాయి శ్రీనివాస్, తాయి సూర్యనారాయణ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కదిరి కాటమరాయుడు బ్రహ్మోత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారికి, ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఆర్ డి ఓ గారికి, ఎస్పీ గారికి,ఆలయ ఉద్యోగులకి, వేద పండితులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి, భక్తులకిYES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ను. ” జయ జయ సింహ, జై నరసింహ “🙏🙏🙏

Posted Under AP
Editor