RWS అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు..
వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణం చర్యలు చేపట్టాలి..
రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని పైప్ లైన్ మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలి.
సాగు నీరు, త్రాగు నీటికి ఎటువంటి అంతరాయాలు రాకుండా చూడాలి..
శ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ పధకం ప్రత్యేక నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ
వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణం చేపట్టాల్సిన కీలక పనుల ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలని కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆదేశించారు. RWS DEE, AE,MPDO, సంబధిత ఇంజనీరింగ్ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ పధకం పై ప్రత్యెక నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పీ.వి. పవన్ కుమార్ రెడ్డి గారు,మండల కన్వీనర్ లు తదితరులు పాల్గొన్నారు
