అశ్వ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన కదిరి ఖాద్రీశుడు…..

అశ్వ వాహనంపై ఖాద్రీశుడు భక్తులకు దర్శనం, రాయలసీమలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవాల్లో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ప్రధానమైనవి. మన భారతదేశంలో అతి పెద్ద మూడో కదిరి రథం ( తేరు ) అని పిలవబడే నవనారసింహాలలో ఒకటైన క్షేత్రం అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో బుధవారం అశ్వవాహన సేవ అత్యంత విశిష్టమైనది. సాధారణంగా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అశ్వ వాహనం ( గుర్రపు వాహనం) పై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఖాద్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు ఈ అశ్వ వాహనంపై ఖాద్రీశుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అశ్వ వాహనంపై ఊరేగే నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల కలి దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఖాద్రిసుని బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నలుమూలల రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాది మంది వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఖాద్రి సునీ బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రసాదించాలనిYES9 టీవీ తరపున కోరుకుంటున్నాను.

Posted Under AP
Editor