తాడిమర్రిలో ఘనంగా వైఎస్ఆర్సిపి 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

తాడిమర్రి (yes9 tv)వైఎస్ఆర్సిపి 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తాడిమర్రిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వైఎస్ఆర్సిపి పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం తాడిమర్రి మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ కేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు తాడిమర్రి మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా “హరితాంధ్రప్రదేశ్ సృష్టికర్త – పేద ప్రజల ఆశాజ్యోతి” అయిన దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి తాడిమర్రి మండల కన్వీనర్లు ఆర్వీటి రామాంజనేయులు, అల్లే సాయినాథ్ రెడ్డి, రామాపురం సర్పంచ్ కుంటాల పుల్లయ్య, ఆత్మకూరు సర్పంచ్ వెంకటనారాయణ రెడ్డి, ఎంపీటీసీ చంద్ర, కప్పల అనిల్, రామాపురం ఈశ్వర్ రెడ్డి, శివానంద రెడ్డి, చింతకాయల రెడ్డప్ప, కమతం శివయ్య, ఆరవేటి పెద్దిరాజు, ఆరవేటి శివ, ఆరవేటి గురు ప్రసాద్, కొంక జగన్ తదితర ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో కష్టపడి రాబోయే సర్పంచ్, జడ్పిటిసి, ఎంపిటిసి మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor