చట్టాలపై అవగాహన
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం
గ్రామాలలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని పెమనకుంటపల్లి తండాలో డిఎస్పి వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మహిళలకు Strategy అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాల అనర్థాల గురించి వివరించారు. అనంతరం గ్రామాలలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని, పైన గ్రామాలలో గొడవలు పడుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేకాట కోడిపందాలు గంజాయి సేవించడం జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నా సాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తమకు సమాచారం అందించాలని వారి పేరు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా డిఎస్పి తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ తో పాటు నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ హెచ్చరిక
